విశాలాంధ్ర – పార్వతీపురం : రాష్ట్రంలో వరదల దృష్ట్యా ముఖ్యమంత్రి సహాయ నిధికి పార్వతీపురంశాఖ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐ.ఎం.ఏ) రూ.1.25 లక్షలు విలువ చెక్కును సోమ వారం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ కు అందజేసారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐఎంఏ అధ్యక్షులు డా.యాళ్ళ వివేక్, కార్యదర్శి డా.వాసుదేవరావుసభ్యులు అందజేసారు. సహాయనిధికి చెక్కును అందించడంపట్ల జిల్లా కలెక్టర్ వైద్యులను అభినందించారు. జిల్లానుండి సహాయ నిధికి అందించడం ఆనందంగా ఉందని, ఉదారత కలిగిన సంఘాలు, వ్యక్తులు ముందుకు రావడం ముదావహమన్నారు. ఈకార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు డా.బి వాగ్దేవి, డా.వై.విపద్మజ, డా.డి.ప్రతిమా దేవి, డా.హేమంత్, డా.పవన్ కుమార్, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.