Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర,పార్వతీపురం: మండలంలోని సంగంవలస గ్రామంలో మంగళ వారం ప్రకృతి వ్యవసాయ వనరులు విస్తరణ మరియు శిక్షణకేంద్రంను జిల్లా ప్రకృతి వ్యవసాయ అసోసియేట్ సభ్యులు మంతిని మానస, దేవిప్రసాద్ లు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ వనరుల విస్తరణ మరియు రైతులకు శిక్షణా కేంద్రంగా పనిచేస్తుందని,
ఈవనరుల కేంద్రంలో రైతులకు అన్ని రకాల చీడ పిడలకు, తెగుళ్లు నివారణకు సంబంధించిన కషాయాలు, పంట పెరుగుదలకు సంబంధించిన ద్రావనాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటలు పండించాలని, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో యూనిట్ ఇంచార్జి గంట తవుడు ఐసిఆర్పీలు తేలు శంకరరావు, పెద్దింటి వెంకటనాయుడు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img