విశాలాంధ్ర,సీతానగరం: పార్వతిపురం మన్యం జిల్లాలోని సీతానగరంమండలంలోని జోగంపేట గ్రామంలోగల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో, కళాశాలలో 88 ఖాళీలున్నాయని, సీట్లు కావలసిన విద్యార్థులు నేరుగా సంప్రదిస్తే జాయిన్ చేసుకుంటామని ప్రిన్సిపాల్ మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతిలో 20 సీట్లు, ఆరవతరగతిలో 18సీట్లు, ఏడవ తరగతిలో 16సీట్లు,8వ తరగతిలో 14సీట్లు, 9వ తరగతిలో 6సీట్లు, ఇంటర్మీడియట్లో 14సీట్లు కలిపి మొత్తం 88 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు కళాశాల కార్యాలయంలో వెంటనే సంప్రదించాలని ఆయన తెలిపారు.