విశాలాంధ్ర, పార్వతీపురం:జిల్లా ఎస్పీ ఎన్ వి మాధవరెడ్డి గారిని ఐఆర్పిడబ్ల్యూఏ డైరెక్టర్ పి ప్రకాష్ కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో తమసంస్ధ చేస్తున్న సేవా కార్యక్రమాలు గూర్చి ప్రకాశ్ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ
శ్రీస్వామి వివేకానందస్ఫూర్తితో యువత చెడుమార్గంలో ప్రయాణించకుండా, మంచి వ్యక్తిత్వంకలిగిన సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని , వారితల్లిదండ్రులకు
ఆగ్రామానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.అంతేకాకుండా నేటియువతకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి వారిలో నైపుణ్యం తగ్గట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.నైపుణ్య శిక్షణ సంస్థలు, నెహ్రుయువకేంద్రం , జిల్లా యువజన సర్వీసులశాఖ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నేటియువత మత్తు పదార్థాలకు, మద్యంకు బానిసకాకుండా మంచి నడవడిక కలిగి ఉండాలని ఆయన సూచించారన్నారు. ఈకార్యక్రమంలో ఐఆర్పిడబ్ల్యూఏ డైరెక్టర్ ప్రకాష్,గణేష్ , సంస్ధ సిబ్బంది కూడా పాల్గొన్నారు.