Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

అడవి నుంచి అంతర్జాతీయ వేదికపై మాట్లడేందుకు ఎంపికైన మనస్విని

మనస్వనికి ప్రశంసల వెల్లువ
విశాలాంధ్ర, కురుపాం: మారుమూల అడవిలో గిరిజన గ్రామానికి చెందిన14ఏళ్ల అమ్మాయి అంతర్జాతీయ వేదిక పై మాట్లడే అరుదైన అవకాశం తన మాటల్తో కైవసం చేసుకుంది. గత నెలలో కురుపాం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమ్మ ఒడి నగదు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట ఆంద్రప్రదేశ్ లో నాడు.. నేడు ,అమ్మ ఒడి ,గోరుముద్ద తదితర విద్యా సంబంధి త సంక్షేమ పథకాలు పై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,మంత్రులు తో అందరి నీ ఆకట్టుకుంది గుమ్మలక్ష్మీ పురం కస్తూరిభా బాలికల విద్యాలయం విద్యార్థిని సామల.మనస్విని. కుటుంబం లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు పక్కన పెట్టి మొక్క ఓని దీక్షతో ద్రృష్టంతా విద్య పైనే పెట్టి ఆంగ్ల భాషాప్రావీణ్యం పొందింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన ఆహ్వానం పై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 13జిల్లా లలో పది పరీక్ష లలో ఉత్తమ ఫలితాలు సాదించిన 10మందిని ఎంపిక చేయగా అందులో తొమ్మిది చదువు తున్నా మనస్విని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలు లోఅవకాశందక్కించుకుంది. వారికి స్క్రీనింగ్ టెస్ట్ , ఇంగ్లీషు మాట్లాడే ప్రావీణ్యం పరీక్ష చేసింది. అందులో 30మంది కి తుది పరీక్ష నిర్వహించీ పదిమంది ని ఎంపిక చేశారు . సెప్టెంబర్15-27వరకు జరిగే యు.ఎన్.ఓ డెలిబెరేషన్ సభలో 18,19 తేదీల్లో న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యా సంస్కరణలు పై మాట్లాడనుంది. అరుదైన అవకాశం సొంతం చేసుకున్న సామల.మనస్విని ని పార్వతీ పురం మన్యం కలెక్టర్ నిషాంత్ కుమార్ , జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ అభినందించారు.
50వేల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే దంపతులు:
అమ్మ ఒడి సభలో పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టకునీ త్వరలో ఐక్యరాజ్య సమితి వేదిక పై మాట్లడే అవకాశం పొందిన కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీ పురం కస్తూరిభా బాలికల విద్యాలయం విద్యార్థిని సామల మనస్విని ని ఎమ్మెల్యే పాముల.పుష్పశ్రీవాణీ ,జిల్లా వైసీపీ అద్యక్షుడు పరీక్షిత్ రాజు లు తమ నివాసంలో ఘనంగా సన్మానించారు. అమెరికా పర్యటన నిమిత్తం 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావాలని ఎల్లప్పుడూ అండగా ఉంటామని హమీ ఇచ్చారు.
అమ్మ తోనే ఒంటరిగా….
మాటల్తో అందరినీ మంత్రముగ్దుల్ని చేసి కట్టి పడేసిన మనస్విని తండ్రి మనస్సు ఇంకా గెలవ లేక పోయింది. వ్యక్తిగత వివరాలు లోనికి వెళ్తే ఒకప్పటి విప్లవాల పురిటి గడ్డ కురుపాం మండలం కొండబారిడి లో తల్లి పత్తిక క్రిష్ణ వేణి తో ఉంటుంది. కుటుంబం లో నెలకొన్న సమస్యల కారణంగా తండ్రి సింహాచలం వారిని విడిచి దూరంగా ఉంటున్నారు. లక్షల మనస్సులను తన ఆంగ్ల ప్రావీణ్యం తో దోచుకున్న మనస్విని తన తండ్రి ని కూడా ఇంత గొప్ప కూతురు ని వదులుకుంది నేను అనేల చేసుకుని తీరుతాననీ బాదాతప్త హ్రృదయం తో పేర్కొంది మనస్విని. సింగిల్ పేరెంట్ కోటాలో కస్తూరిభా బాలికా విద్యాలయం లో చేరింది.
కెజిబివి వ్యవస్థ కే గర్వకారణం:
కెజిబివి గుమ్మలక్ష్మీ పురం విద్యార్దిని సామల.మనస్విని ఐక్యరాజ్య సమితి వేదికపై మాట్లాడే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవటం మొత్తం కస్తూరిభా బాలికా విద్యాలయాలు వ్యవస్థ కే గర్వించదగ్గ గుర్తింపు అని ప్రిన్సిపాల్ చుక్క. శ్రీరంజనీ తెలిపారు. విద్య తో పాటుగా అన్ని రంగాల్లో ను విద్యార్థులు ను తీర్చి దిద్దేందుకు మరింత ఉత్సాహం నింపినట్లైందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img