విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాలోని 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లాలో ఉత్తమ అధికారులుగా ఎంపిక చేసిన 351మందికి రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 18మంది జిల్లా అధికారులకు, మిగిలిన వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.జిల్లాస్థాయిలో సీతమ్మపేట,పార్వతీపురం ఐటిడిఎ పిఓలు కల్పనకుమారి, విష్ణు చరణ్, పాలకొండ సబ్ కలక్టర్,పార్వతీపురం ఆర్డీఓలు నూరుల్ క్వామర్, కె.హేమలత, డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్,పంచాయతీ రాజ్ ఈఈ డాక్టరు కృష్ణయాజీ, డిఈఓ ఎన్ ప్రేమ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ విజయగౌరీ, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి గాయాజుద్దీన్, జిల్లా ఆసుపత్రిల సమన్యయ అధికారి డాక్టర్ బి.వాగ్దేవి, పౌరసరఫరాలఅధికారి ఎం. దేవుళ్ళనాయక్, డ్వామాపిడి కె. రామ చంద్రరావు, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయికుమార్,పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు, జిల్లా ఆడిట్ అధికారి ఏవి రమణలు ప్రశంసా పత్రాలను తీసుకున్నారు. ఏఆర్ డిఎస్పీ బి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రికి గౌరవ వందనం, పెరేడ్ నిర్వహణ చేపట్టారు. వివిధ శాఖలు ఏర్పాటుచేసిన శకటాలు, స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్మేడ్ పొలీస్ విభాగం పెరేడ్ నిర్వహణ, మార్చ్ పాస్ట్,వివిధ పాటశాలల విధ్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాపౌర సంబంధాల కార్యాలయం నుండి సహాయ సమాచార ఇంజనీర్ సి హెచ్ శ్రీనివాసరావు, డివిజనల్ పిఆర్ఓ ఐ.శ్రీనివాసరావులు ఉత్తమ అధికారులుగా ప్రశంసా పత్రాలు తీసుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు కూడా ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు.ఈకార్యక్రమంలో జిల్లాల్లోని పార్వతీపురం, కురుపాం ఎమ్మెల్యేలు జోగారావు, పుష్పాశ్రీవాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, దాసరి కార్పొరేషన్ చైర్మన్ రమాదేవి, జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిదులు, వివిధ శాఖల ఉద్యోగులు, విధ్యార్థులు పాల్గొన్నారు.