విశాలాంధ్ర, పార్వతీపురం:పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలో స్నేహకళాసాహితీ ఆద్వర్యంలో బుదవారం సాయంత్రం ప్రముఖకవి ,కథారచయిత, గేయరచయిత, గాయకులు గంటేడ గౌరునాయుడు 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయనరచించిన “నాగావళి నడకలు”, ఆయన మిత్రులు రాసిన
“నీస్ఫూర్తితో” పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంను నిర్వహించారు. స్థానిక ఎన్జిఓ భవనంలో” ఒకసప్తతి సంతోషహేళ- మరికొన్ని ఆవిష్కరణలవేళ” పేరిట జరిగిన కార్యక్రమంలో సాహితీవేత్తల సమక్షంలో గంటేడ గౌరునాయుడు-జానకమ్మలతోపాటు సాహితీలహరి అధ్యక్షులు డాక్టర్ మంచుపల్లి శ్రీరామ్మూర్తి, ప్రముఖవైద్యులు వెంకటరావు,సాహితీవేత్త చదలవాడ సత్యనారాయణలు కలిసి పుస్తకాలను ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా పలువురు సాహితీ ప్రముఖులు మాట్లాడుతూ నాగావళి నదిఒడ్డున ఉన్న జీవితాలను అక్షరబద్ధం చేస్తూ గంటేడ గౌరునాయుడు జ్ఞాపకాలని, అనుభవాలని రికార్డుచేసిన చారిత్రక చిత్రమే నాగావళి నడకలు పుస్తకమని తెలిపారు. గంటేడ స్ఫూర్తితో కవులుగా,రచయితలుగా ఎదిగిన వివిధ సాహిత్యకారులు తమ స్పందనను తెలిపిన పుస్తకం నీ స్ఫూర్తితో అని తెలిపారు.ఉత్తరాంధ్ర జనజీవితాన్ని, ప్రజల ఆకాంక్షలను తన రచనలద్వారా ప్రపంచానికి తెలియజేసిన సాహితీవేత్త గౌరు నాయుడని పలువురు తెలిపారు. తనతదనంతర తరాన్ని తయారుచేసుకున్న గొప్ప సృజనకారుడు గంటేడ గౌరునాయుడని వారంతా తెలిపారు. ఉత్తరాంధ్రలో ఎంతోమంది రచయితలను,కవులను తీర్చిదిద్దిన ఘనత కూడా గౌరునాయుడుకే దక్కుతుందన్నారు. ఎన్నో పుస్తకాలను రచించడంతోపాటు ఎన్నో అవార్డులను సత్కారాలను ప్రశంసలను పొందిన మహోన్నత వ్యక్తి గౌరునాయుడని వారంతా కొనియాడారు.70వసంతం పూర్తిచేసుకొని 71వవసంతంలోకి అడుగుపెట్టిన గౌ.నాను సాహితీవేత్తలు, కుటుంబసభ్యులు,శ్రేయోభిలాషులు, మిత్రులు,బంధువులు, స్నేహితులు ఘనంగా సత్కరించి ఆయనకు ఆశీస్సులను అందజేసారు.ఈకార్యక్రమంలో స్నేహ కళా సాహితిఅధ్యక్షులు జి రామకృష్ణ, రచయితలు జాగాన సింహాచలం, పాలకొల్లు రామలింగస్వామి, మళ్ళిపురపు జగదీశ్,చింత అప్పలనాయుడు, పక్కి రవీంద్ర, తేజోమూర్తుల ప్రకాశరావు,
ఎం వి ఆర్ శర్మ, సిరికి స్వామినాయుడు, పల్లరోహిణి, పిల్లా లక్షుమునాయుడు, గొండేల రాజారావు, చందనపల్లి గోపాల రావు, నాగు కాకిముక్కల, కుటుంబ సభ్యులు గంటేడ సోమేశ్వరరావు, చిన్నంనాయుడు, కర్రి పకీరునాయుడు- భారతి, పిన్నింటి లక్షుమునాయుడు- నారాయణమ్మ, గంటేడ కిరణ్ కుమార్, క్రాంతికుమార్ , చిన్నంనాయుడు,మంతిని రమేష్, మంతిని శ్రీనివాసరావు, మిత్రులు గొర్జి దాలినాయుడు, బడే శ్రీరాములు నాయుడు, రిటైర్డ్ తహశీల్దార్ గొర్లి అప్పలరాజు, గిరిజన సంఘం నాయకుడు పాలక రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.