Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

నిడగల్లు ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గా రామకృష్ణ, వైస్ చైర్మన్ గా రేవతిలు

మూడోసారి పూర్తయిన ఎన్నికలు
విశాలాంధ్ర- సీతానగరం: మండలంలోని నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. గతంలో రెండుసార్లు వాయిదాపడిన 7వ తరగతి సభ్యులఎన్నిక ఉదయం పూట 24మంది తల్లిదండ్రులు హాజరుకాగా వారంతా ఏకగ్రీవంగా ముగ్గురు సభ్యులను ఎన్నుకున్నారు. రెండవ పూట చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగక 3వతరగతి నుండి10వ తరగతి వరకు సభ్యులుగా ఎన్నికైన 24మంది హాజరయ్యారు.చైర్మన్ గా కర్రి రామకృష్ణ, వైస్ చైర్మన్ గా రాయిపల్లి.రేవతిలను ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈనెల 1వతేదీన, 17వతేదీనరెండుసార్లు వాయిదాపడిన ఈస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఎట్టకేలకు నెలాఖరులో శనివారంనాడు మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని హెచ్ఎం మనోజ్ కుమార్ తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికైనవారితో ప్రమాణస్వీకారం, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించామని హెచ్ఎం మనోజ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాలతో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు, స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటుచేసి ఉదయంనుంచి సాయంత్రం వరకు బందోబస్తును నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారంతా వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు కావడంతో వారిని మాజీఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎంపీపీ బలగ శ్రీరాములు నాయుడు, జడ్పిటిసి బాబ్జి, వైస్ ఎంపీపీ సూర్యనారాయణ, మాజీఎంపీపీ శనపతి ప్రసాద పాత్రుడు, గ్రామపెద్దలు ఆర్ ఆరుద్రమ్మ,గాజాపు శ్రీనివాసరావు,
గాజాపు వెంకటనాయుడు, పరువాడ తిరుపతిరావు, బర్ల సింహాచలం నాయుడు తదితరులు అభినందించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో పలు గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రెండుసార్లు ఎన్నికలు వాయిదాపడి మూడవసారి పూర్తికావడంతో అందరూ ఆనందం వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల తరహాలో గతనెలరోజులుగా నిడగల్లు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఈఎన్నికల వేడి ఏర్పడినది. ఎన్నికలు పూర్తికావడంతో నాయకులుతో పాటు ఉపాధ్యాయులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇకనుండి పిల్లల పాటలు పై దృష్టి సారించడానికి అవకాశం ఏర్పడిందని వారు తెలియజేయడం గమనార్హం. ఈఎన్నికలు జరిగినసమయంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి బి. రాజ్ కుమార్ రావడం శాఖాపరమైన విచారణకు రావడం అందరిలో టెన్షన్ ఏర్పడింది. ఆయనే ఎన్నికలు నిర్దిష్టనిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని తెలియజేయడంతో వారంతా ఊపిరి పీల్చుకొని ఎన్నికలను పూర్తిచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img