విశాలాంధ్ర – సీతానగరం : అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందజేసి వారిలో రక్తహీనత తొలగించడంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సర్పంచ్ తేరేజమ్మ ఎంపీటీసీ గౌరీ,కుసుమకుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పూర్ణిమలు పిలుపునిచ్చారు. బుధవారంనాడు మండలంలోని పెదభోగిలగ్రామపంచాయతీలో పది అంగన్వాడికేంద్రాల ఆధ్వర్యంలో పోర్షన్ అభియాన్ కార్యక్రమాన్ని పెదభోగిల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంగూర్చి వివరించి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు గూర్చి, పోషకాహార వారోత్సవాలు గూర్చి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రామలక్ష్మి, సునీత, శైలజ, లక్ష్మీ, సువర్ణకుమారి, సీతామహాలక్ష్మి, రమాదేవి, సుజాత సుగుణలతోపాటు సహాయ కార్యకర్తలు, ఏఎన్ఎం కుమారి, ఎం ఎల్ హెచ్ పి సునీత,ఆశాకార్యకర్తలు సంతోషి, బాలమ్మ ,సత్యవతి, పార్వతి, అరుణతో పాటు తల్లులు, గర్భిణీలు, బాలింతలు పిల్లలుపాల్గొన్నారు.