Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

టిడిపి నియోజకవర్గ ఇంచార్జిగా విజయ్ చంద్ర నియామకంను స్వాగతిస్తున్న పార్టీ నేతలు…

విశాలాంధ్ర -పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు కత్తిమీద సాము లాంటిదని చెప్పవచ్చు.అధికార పక్షంకంటే ప్రతిపక్షాలు ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా చూస్తున్నాయి.ఇదే సందర్భంలో పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై గతమూడు నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తులు చేశారు.దీనిలో భాగంగానే ఇంతవరకు టీడీపీలో నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, గర్భాపు ఉదయభాను, వాడాడ రాము, ఎక్సయిజ్ సీఐ విజయకుమార్ ఇలాంటి పేర్లు వినిపించి వీరిలోఒకరు రానున్న ఎన్నికలలో టీడీపీ తరఫున ఎవరైనా ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం ఉండేది.కానీ గురువారంరాత్రి రాష్ట్ర టీడీపీ అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఒక్కసారిగా యువకుడు,మేధావి, ఆర్థిక బలం, ఖండబలంగలిగిన బోనెల విజయ్ చంద్రను పార్వతీపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఎంపికచేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు.విజయ్ చంద్ర నియోజక వర్గంలోని పెద్దగ్రామమైన నరిసి పురం గ్రామానికి చెందినవాడే కావడంతో పాటు ఎస్సీలో మాదిగ కులానికి చెందిన వాడు.దీంతోపాటు బి.టెక్, ఎమ్.ఎస్. డబ్ల్యూ. విద్యార్హత కలిగిఉండి , తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగాను, గ్లోబల్ ఇంటెన్షియల్ ఫర్ మాదిగ ఛాంబర్ ఫౌండర్ మెంబర్ గాను, జాయింట్ సెక్రటరీగాను, వివిధ సేవా కార్యక్రమాలు,సేవలు అందిస్తూ కేంద్ర, రాష్ట్ర టీడీపీ నేతలతో సంబంధాలు కలిగిన వ్యక్తిగా పేరు ఉంది. నియోజకవర్గంలోని మూడుమండలాల్లో ఉన్న మాదిగల కుటుంబాలతో కూడా సన్నిహిత సంబంధం ఉంది.ఇదిలా ఉండగా కొత్త ఇంచార్జి బొనేల విజయ్ చంద్రపై పలువురు స్పందిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని మేము ఆమోదం తెలపడం తప్ప దానిపై ఎటువంటి ప్రకటన చేయలేమని తెలిపారు. పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చిన అభ్యర్ధిగెలుపుకు, ముఖ్య మంత్రిగా చంద్రబాబునాయుడును చేసేందుకు కష్టపడి పనిచేయడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఒక ఆశా వాహుడు ప్రెస్ మీట్ అని చెప్పి చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. బలిజపేటమండలానికి చెందిన ఒక ఆశా వాహూడు పార్టీకోసం కష్టపడి పనిచేసే వారికి తప్పించి ఎన్ ఆర్ ఐ లకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుందన్నారు. మూడు మండలాల, పట్టణపార్టీఅధ్యక్షులు మాత్రం పార్టీ అధిష్టాన నిర్ణయం శిరోదార్యమని చెప్పడం గమనార్హం. పార్టీకోసం కష్టపడి పనిచేయడం తప్ప పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని వారిమాటల్లో తెలిసింది. ఏదిఏమైనా పార్వతీపురం టీడీపీ శాసనసభ నియోజకవర్గ ఇంఛార్జి మార్పు ఇటు ప్రతిపక్షంలోను, అటు అధికార పక్షంలో ఒక్కసారి అలజడి మొదలైంది. గత రెండురోజులుగా ఎక్కడ విన్న బొబ్బిలి చిరంజీవులు మార్పు గూర్చే చర్చలు జరుగుతున్నాయి. మంచివ్యక్తిని మార్చారని కొంతమంది అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకీ దీటైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలంటే అభ్యర్థి మార్పు తప్పని సరి కనుక విజయ్ చంద్ర నియామకంను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నియమించిన ఇంచార్జి విజయ్ చంద్ర మాత్రం నియోజకవర్గంలో అందరికీ కొత్తవాడుకావడం గమనార్హం.శనివారం నుండి నియోజకవర్గంలో ముమ్మర పర్యటనలు చేస్తూ అందరినీ సమన్వయము చేస్తూ పార్టీఆదేశాలు మేరకు నడుచుకుంటానని కొత్తగా నియమించబడిన ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర విశాలాంధ్రకు తెలిపారు.నియోజక వర్గనాయకులను, మండల,గ్రామపార్టీ నాయకులను, కార్యకర్తలను కలసి పార్టీ గెలుపుకు కష్టపడి పనిచేస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img