విశాలాంధ,పార్వతీపురం : పార్వతీపురం నూతన ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా ఎస్. సేధు మాధవన్ సోమవారం భాద్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఐటిడిఎ ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజానాభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన విష్ణు చరణ్ బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇంత వరకు జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక ఇంచార్జి పిఓగా వ్యవహరించారు. కొత్తగా జాయిన్ అయిన ఐటిడిఏ పిఓను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.