విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లాలో 15మండలాల పరిధిలో వాయిదాపడిన 18పాఠశాలల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను ఈనెల 17న నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లావిద్యాశాఖ అధికారి పగడాలమ్మ తెలిపారు.1598 పాఠశాలలో 1580పాఠశాలలో ఎన్నికలు పూర్తయిన సంగతితెలిసిందే. మిగిలిన పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్నిమండలాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
సీతానగరంమండలంలో…
వాయిదాపడిన 3 ఎస్ఎంసిలకు ఆగస్టు 17న ఎన్నికలు నిర్వహణ:మండలంలో గురువారం జరిగిన
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలను నిర్వహించేందుకు తగినసంఖ్యలో కోరం
లేకపోవడం వలన వాయిదాపడిన నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,అంటిపేట, కొత్తవలస ప్రాథమిక పాఠశాలల్లో ఈనెల 17నఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓలు సూరిదేముడు, వెంకటరమణలు తెలిపారు.తాజా షెడ్యూల్ ను స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విడుదల చేసారని చెప్పారు. వాయిదా పడిన పాఠశాలల హెచ్ఎంలు శనివారం ఓటర్ల జాబితాను పాఠశాల నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించి తల్లిదండ్రులకి తెలియచేయాలన్నారు. ఈనెల 12వరకు అభ్యంతరాలను స్వీకరించాలని,
ఆగస్టు 17న ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలన్నారు.