విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని గుచ్చిమి, నిడగల్లు గ్రామ పంచాయతీలో ఓటరు తొలగింపు ప్రక్రియను రెవిన్యూ డివిజనల్ అధికారి, పార్వతీపురం నియోజకవర్గ ఓటరునమోదు అధికారి కె.హేమలత మంగళవారం పరిశీలించారు. గుచ్చిమిగ్రామంలో 108, 109 పోలింగ్ కేంద్రాలలో 58ఓట్లు తొలగింపుగూర్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.నిడగల్లులో 115,116, 117పోలింగు కేంద్రాల పరిదిలో 82ఓట్లు తొలగించగా,116, 117పోలింగు కేంద్రాల్లో ఇంకా డెత్ లు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆదేశించారు ఈసంధర్భంగా ఆర్డీఓ హేమలత మాట్లాడుతూ ప్రతి మంగళవారం ఓటరు నమోదు అధికారి పరిధిలో రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అందులో బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఓటరు తొలగింపు ప్రక్రియను, వివరాలను తెలియజేయడం ద్వారా మరింత పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. ప్రతినిధుల సూచన మేరకు గురువారం బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి తొలగింపు వివరాలు వెల్లడించాలని బి.ఎల్.ఓలను ఆదేశించామన్నారు.పార్వతీపురం నియోజక వర్గంలో అన్ని బూత్ లలో బి.ఎల్.ఓలు సమావేశాలు ఏర్పాటు చేశారని చెప్పారు. బూత్ స్థాయి ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించడం జరుగుతుందన్నారు. తప్పులులేని ఓటరు జాబితా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె తెలిపారు. తొలగింపు జరిగిన ఓట్లపై సందేహాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆమె కోరారు.ఈకార్యక్రమంలో ఆమెతో పాటు తహశీల్దార్ ఎన్వీ రమణ, ఆర్ ఐ శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీలు, బిఎల్ఓలు స్వాతి,గణపతి, తాడేల మోహినీ, కృష్ణ, లక్ష్మి, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.