విశాలాంధ్ర,పార్వతీపురం: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆద్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమంను నిర్వహించారు.జిల్లా నలుమూలలనుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ, ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్ లైన్ మోసం, అనధికార చీటీలు, ప్రేమపేరుతో మోసం,ఇతర సమస్యలపై ఆరుగురు ఫిర్యాదు దారులు స్వేచ్ఛగా విన్నవించుకున్నారు.వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషిచేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సంబంధిత నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపవలెనని అధికారులను ఆదేశించారు. ఈస్పందన కార్యక్రమంలో ఎస్పీతో పాటు దిశాడిఎస్పీ ఎస్.ఆర్. హర్షిత , ఎస్బి సిఐ సిఎచ్. లక్ష్మణరావు, డి.సి.ఆర్.బి సిఐ ఎన్.వి. ప్రభాకరరావు సిబ్బంది పాల్గొన్నారు.