విశాలాంధ్ర, పార్వతీపురం: రాష్ట్ర టీడీపీ అధినేత ఆదేశాలు మేరకు సోమవారం ఇసుకఅక్రమ మైనింగుపై స్థానిక సువర్ణ ముఖినది వద్ద సత్యగ్రహ నిరసన కార్యక్రమంను టీడీపి నియోజకవర్గ ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్,మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల ఆద్వర్యంలో చేపట్టారు. స్తానిక టీడీపీ నేత హరి గోపాల్ ఇంటినుండి ఇసుకరేవు వరకు నినాదాలు చేస్తూ, పాదయాత్ర చేశారు.ఇసుకరేవు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.టెండర్లు పిలవకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మంగళ వారం నాడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మండలపార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో తహశీల్దార్, ఎస్ఐ లకు అక్రమ ఇసుక మైనింగ్ పై వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. సువర్ణముఖి నదివద్ద నిరసన దీక్ష ముగిసాక సీతానగరం పురవీదులగుండా సీతానగరం హనుమాన్ దేవాలయం వరకు నినాదాలు చేస్తూ వచ్చారు.ఈకార్యక్రమంలో నియోజక వర్గంలోని మూడు మండలాల టీడీపీ కీలక నేతలు కొల్లి తిరుపతిరావు, దొగ్గ మోహన్, పెంకి వేణుగోపాల నాయుడు,రవికుమార్, రౌతువేణు గోపాల్, గొట్టాపు వెంకట నాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, బార్నాల సీతారాం, చంద్ర మౌళి, గౌరునాయుడు, బాబ్జి,సీతానగరం,పార్వతీపురం, బలిజిపేట మండల టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నీలకంఠం ఆద్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.