ఘనంగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
విశాలాంధ్ర, సీతానగరం: గురువారం నాడు మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని కార్యాలయాల్లో విద్యాసంస్థలలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బలగ రవణమ్మ శ్రీరాములు నాయుడు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మామిడి బాబ్జి, ఎంపీడీవో కుమార్ వర్మ, పరిపాలన అధికారి ప్రసాద్ , ఎంఈఓలు సూర్యదేముడు, వెంకటరమణ, ఉపాధి హామీ పథకం ఏపీఓభాను,వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రాములమ్మ డిప్యూటీ తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉషారాణి, పావని, పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ లంక శ్రీనివాసరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ దాలినాయుడు, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ జగన్మోహనరావు, పశు వైద్య కార్యాలయంలో ఏడి డాక్టర్ దీనకుమార్, నిడగల్లు పశువైద్య కేంద్రంలో డాక్టర్ ఎస్.రామారావు, పెదంకలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు రాధాకాంత్,జోగంపేట ప్రతిభ కళాశాలలో ప్రిన్సిపాల్ ధర్మరాజు, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్ మధు, కేజీబీవీలో ప్రిన్సిపాల్ జొన్నాడ సంధ్య, వెలుగు కార్యాలయంలో ఏపిఎం శ్రీరాములునాయుడు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా
నిర్వహించారు. సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎమ్ ప్రసన్నలక్ష్మి, మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం ఓలేటి తవిటి నాయుడు, నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం మనోజ్, బూర్జ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామకృష్ణ, గాదెలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం మూడడ్ల శంకరరావు, జగ్గునాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ ఎం జి.వెంకటరమణల ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యాకమిటీ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు, నాయకులు , తల్లిదండ్రులు పాల్గొని జెండాను ఎగురవేశారు. గెడ్డలుప్పి కూడలిలో ఉన్న కృషి స్కూల్లో కరస్పాండెంట్ ద్వారపరెడ్డి శ్రీనివాసరావు, హోలీ క్రాస్ స్కూల్లో ప్రిన్సిపాల్ సిస్టర్ నీలిమా గ్రేస్ బీలోంగ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రాథమికోన్నత, ప్రాథమికపాఠశాలలలో విద్యా కమిటీ చైర్మన్లు జెండాను ఎగరవేయగా ప్రజా ప్రతినిధులు,నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెదభోగిలి మేజర్ పంచాయతీలో జెండావందనం కార్యక్రమంలో సర్పంచ్ తేరేజమ్మగరికయ్య, ఉప సర్పంచ్ కె. అరవింద్, టీడీపి నాయకులు సాల హరి, దామినేని భాను ప్రసాద్, సబ్బాన శ్రీనివాసరావు, బుడితి శ్రీనివాసరావు,రాంబాబు, సెక్రటరీలు రమేష్,సుధారాణి,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.35గ్రామ పంచాయతీలో, 21గ్రామ సచివాలయంలో సర్పంచులు జెండాను ఎగురవేశారు. అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, చినభోగిలి గ్రామ కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారి అవార్డులు అందుకున్న మండల విద్యాశాఖాధికారి సూరిదేముడు, వెలుగు ఏపిఎం శ్రీరాములనాయుడులను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా శాఖల సిబ్బంది అభినందనలు తెలిపారు.