Monday, September 25, 2023
Monday, September 25, 2023

టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రకు అనూహ్య స్పందన

విశాలాంధ్ర-పార్వతీపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళంపాదయాత్ర గురువారం నాటికి 200రోజులు పూర్తయిన సందర్బంగా యువగళం పాదయాత్రకు సంఘీభావంగా స్థానిక వెంకంపేట గోళీలనుండి ఎం ఆర్ నగరం వరకు మూడు కిలోమీటర్లు టీడీపీనేతలు, అభిమానులు, మహిళలు, కార్యకర్తలు టీడీపీ జెండాలు పట్టుకుని పాదయాత్రను నియోజకవర్గ ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర ఆద్వర్యంలో నిర్వహించారు.తెలిపారు.ఉత్సాహంగా టిడిపికు మద్దతుగా నినాదాలు చేస్తూ నిర్వహించిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది.మహిళలకు  ఉచిత ఆర్టీసీప్రయాణం,పేదకుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం,నిరుద్యోగ భృతి కింద 3వేలరూపాయలు ఆర్థిక సాయం,
ప్రతిఇంటికి ఉచితకొళాయి సదుపాయం,ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 15 వందల ఆర్థికసాయం,అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20వేల రూపాయలు ఆర్థికసాయం,
తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15 వేలరూపాయలు ఆర్థిక సాయం,యువగలం పథకం కింద 20 లక్షల ఉద్యోగ కల్పన, టీడీపీ కొత్తగా ప్రకటన చేసిన మ్యానీఫెస్తో కార్యక్రమాలపై నియోజక వర్గ ఇంచార్జి విజయ్ చంద్ర వివరించారు.ఈకార్యక్రమంలోమాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్,మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ మున్సిపల్ చైర్మన్ డి.శ్రీదేవి, నియోజకవర్గ నేతలు గర్భాపు ఉదయభాను, గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, బార్నాల సీతారాం, మూడు మండలాల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు దొగ్గ మోహన్, బోను దేవిచంద్రమౌళి, జాగాన రవి,కొల్లి తిరుపతిరావు, రౌతు వేణుగోపాలనాయుడు, పి.రవికుమార్, పెంకి వేణుగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img