విశాలాంధ్ర, సీతానగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు మండలంలోని పెదభోగిల, నిడగల్లు, తామరకండి, అంటిపేట గ్రామ సచివాలయాల్లో ఎల్ఈడి స్క్రీన్లుఏర్పాటు చేసారు. టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎన్డీఏ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ప్రజలు ఉద్యోగులు వీక్షించేలా తగు చర్యలుతీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు ఎంపీడీవో ఈశ్వరరావు ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శులు ఏర్పాటుచేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు,టిడిపి, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వీక్షించారు.