Homeజిల్లాలుకర్నూలుపెద్దకడబూరును కరువు మండలంగా ప్రకటించాలి

పెద్దకడబూరును కరువు మండలంగా ప్రకటించాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ జిల్లా పిలుపు మేరకు బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ కారణంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో సాగుచేసిన పంటలు పూర్తిగా దెబ్బ తిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యంగా పత్తి, వేరుశెనగ, టమాటా, కంది, ఉల్లి, మిరప, ఆముదం తదితర పంటలకు రైతులు ఎకరాకు 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేశారన్నారు. వర్షాలు సకాలంలో పడక పంటలన్నీ ఎండిపోయి, చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. కౌలు రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మంత్రాలయం నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 50 వేల రూపాయలు చెల్లించాలని, ఉపాధి పథకం కింద దినసరి వేతనం 700 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దకడబూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేంత వరకు సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు తిక్కన్న, కుమ్మరి చంద్ర, ఏఐవైఎఫ్ నాయకులు వీరేష్, నాయకులు చాకలి మూకన్న, కల్లుకుంట వీరేష్, హనుమప్ప, హసన్ పీరా, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు