మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 48 వార్డులలో 17,555 మంది పెన్షన్ దారులకు సచివాలయ ఉద్యోగుల ద్వారా అక్టోబర్ 30వ తేదీ న పెన్షన్ పంపిణీ జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 48 వార్డులలో సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేస్తారని, పెన్షన్ దారులు ఇంటివద్దె ఉండాలని, మా కార్యాలయ సిబ్బంది వచ్చినప్పుడు సమయానికి సహకరించాలని వారు తెలిపారు. ఎవరికి ఎటువంటి లంచం ఇవ్వరాదని, ఎవరైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. మొత్తం 48 వార్డులలో17,555 మందికి 7 కోట్ల,71 లక్షల, 80 వేల 500 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. తదుపరి ఎన్నికల కార్యక్రమం ఉన్నందున పెన్షన్ తీసుకొని వారికి నవంబర్ 5వ తేదీ లోపు తప్పక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
అక్టోబర్ 30వ తేదీనే పెన్షన్ పంపిణీ..
- Advertisement -
RELATED ARTICLES


