Wednesday, February 18, 2026
Homeజిల్లాలునెల్లూరురాబిస్ వ్యాది పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి... ఏడి. చిన్నకేశవులు

రాబిస్ వ్యాది పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి… ఏడి. చిన్నకేశవులు

- Advertisement -

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : పెంపుడు కుక్కలలో వచ్చే రాబిస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చెన్నకేశవులు అన్నారు. ఆదివారం
వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకాల కార్యక్రమము మండల కేంద్రమైన వలేటివారిపాలెం పశువైద్యాశాలలో జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. ఎంతోటి చెన్నకేశవులు మాట్లాడుతూ ‘పెంపుడు కుక్కలలో రాబిస్ వ్యాధి చాలా ప్రమాదకరమైన సంక్రమణ వ్యాధి అని,కుక్కలు నుండి మనుస్యులకు సోకే అవకాశముందని. కనుక ఈ వ్యాధి పట్ల అప్రమతంగా ఉండి సంవత్సరానికి ఒక్కసారి ఈ వాక్సిన్ చేయించుకున్నట్లయితే ఈ వ్యాధి నుండి మన పెంపుడు కుక్కలతో పాటు మనం కూడా రక్షించుకోబడతామని తెలియజేశారు . వాక్సిన్ పశువైద్యాశాలలో ఎప్పుడు అందుబాటులో వుంటాయని ముందస్తుగా చేయించుకున్నట్లయితే మంచిదని తెలిపారు. ఈ సందర్భంగా 15కుక్కలకు వాక్సిన్ చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమములో పెంపుడుకుక్కల యజమానులతోపాటు మొబైల్ వెహికల్ డాక్టర్ వాసంతి, లైవస్టాక్ అసిస్టెంట్ శ్రీలత, కిరణ్, రమేష్, శ్రీమాన్, వెంకటేశ్వర్లు, అభి, శరత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు