Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :-ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలుపై మంగళవారం నాగులుప్పలపాడు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఎంపీపీ నలమలపు అంజమ్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీ లలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బందిని సమన్వయం చేసుకొని పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు పలు అంశాలపై చర్చించారు నూతనంగా విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి దంపతులను శాలువాలు కప్పి సన్మానించారు అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు గ్రామాల్లో ఉపాధి కూలీలకు వంద రోజులు పని దినాలను కల్పించాలని సూచించారు అవినీతికి తావు లేకుండా చిత్తశుద్ధితో పని చేయాలన్నారు కొత్త పనులను గుర్తించి ఆమోదం పొందాలన్నారు కార్యక్రమంలో ఎంపీడీవో జయమణి, ఈఓఆర్డి ఏవివి కుమారి, ఏపీఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img