విశాలాంధ్ర- వలేటివారిపాలెం : మండలంలోని పవిత్రపుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంను కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు శనివారం మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి తమ వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కె.బి. శ్రీనివాసరావు కు అందించారు. నాగేశ్వరరావు గారి వెంట వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కందుకూరు మండలం పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, కందుకూరు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పలువురు నాయకులు ఉన్నారు.