Friday, December 1, 2023
Friday, December 1, 2023

సచివాలయాల ద్వారా అత్యుత్తమ సేవలు

ప్రకాశంజిల్లా : గ్రామ సచివాలయాల ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని సంతనూతలపాడు శాసనసభ్యులు టిజెఆర్‌ సుధాకర్‌ బాబు అన్నారు. సోమవారం మండలంలోని చీర్వానుప్పలపాడు, అమ్మనబ్రోలు, ఎం.ముప్పాళ్ళ గ్రామాలలో సచివాలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా ముప్పాళ్ళ లో జరిగిన సభలో ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు మాట్లాడుతూ సర్పంచ్‌ వైకుంఠ పద్మశ్రీ వీరాంజనేయులు దంపతులు సచివాలయానికి స్థలం కేటాయించి వైఎస్సార్‌ ప్రాంగణంగా నామకరణం చేయడం అభినందనీయమన్నారు. తద్వారా ఆ ప్రాంగణంలో సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం , వెటర్నరీ ఆసుపత్రి , పాలకేంద్రం కార్యాలయాలు నిర్మించి అన్ని సేవలు ఒకే చోట ముప్పాళ్ళ మద్దిరాల గ్రామాలకు మెరుగైన సేవలు అందించుటకు వెసులుబాటుగా ఉంటుందన్నారు . ఇటువంటి సౌకర్యం మండలంలో ఎక్కడా లేదన్నారు. వాటితో పాటు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డా. వైఎస్‌ .రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం కొరకు నేడు భూమి పూజ చేసి శ్రీకారం చుట్టడం మంచి పరిణామమన్నారు. ఈ ప్రాంగణాన్ని ప్రభుత్వ రికార్డులో వెస్సార్‌ ప్రాంగణంగా నమోదు చేయాలని రెవిన్యూ అధికారులను కోరారు. గ్రామంలో ఎస్సీ కాలనీలపై దృష్టి సారించి అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని సర్పంచ్‌ కు సూచించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రైతులు ఎర్రకాలువ అభివృద్ధి చేసి పంట పొలాలను ముప్పు నుండి కాపాడాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సర్వే చేయించి మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. తొలుత ఎమ్మెల్యేను ఒంగోలు జాతి పందెపు ఎడ్ల బండిపై సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి నలమలపు కృష్ణారెడ్డి, కంచర్ల సుధాకర్‌, మారెడ్డి సుబ్బారెడ్డి ,మారెళ్ళ బంగారుబాబు మారెడ్డి వేంకట శేషయ్య కూనం పూర్ణచంద్రరావు మారెడ్డి వీరారెడ్డి పెనుభోతు రంగారావు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img