Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అభివృద్ధి నిరోధకుడు ఎంపీడీవో వై. శ్రీనివాసరావు

మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న ఎంపీడీవో బృందం
అభివృద్ధికి సహకరించడం లేదని ఎంపీపీ ఆవేదన
ఎంపీడీవో తీరును నిరసిస్తూ సమావేశం బహిష్కరించిన సర్పంచ్‌ రమేష్‌

విశాలాంధ్ర` నాగులుప్పలపాడు : మండల అభివృద్ధికి ఎంపీడీవోలు సహకరిస్తూ ఉంటుండగా ఇక్కడ ఎంపీడీవో శ్రీనివాసరావు అభివృద్ధి నిరోధకుడుగా మారి ఏమాత్రం సహకరించటం లేదని ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాసరావు తీరుపై ఎంపీపీ ఆవేదనతో మాట్లాడారు. సమావేశం పలు శాఖల అధికారులు గైర్హాజరు కాగా వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు చేకూరపాడు సర్పంచి కొమ్మినేని రమేష్‌ బాబు మాట్లాడుతూ సర్పంచ్‌ నైన తనకు ఎంపీడీవో శ్రీనివాసరావు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా బయట వ్యక్తుల తో పంచాయతీలో కార్యకలాపాలను నిర్వహించాలని చూడటం ఎంతవరకు న్యాయమన్నారు ఇలాంటి ఎంపీడీవో ఉన్నంతకాలం సర్పంచులు అయిన తమకు ఏమాత్రం గౌరవం లభించడం లేదని అందుకు నిరసనగా మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వివరించి ఎంపీడీవో శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు ఒమ్మేవరం సర్పంచ్‌ పాలపర్తి బాలకోటి మాట్లాడుతూ తాను తెలుగుదేశం మద్దతుతో సర్పంచిగా గెలిచిన తన గ్రామ అభివృద్ధికి పార్టీలకతీతంగా తాను పనిచేస్తున్నానని ఒమ్మేవరం గ్రామ అభివృద్ధికి పార్టీని చూడకుండా నిధులు అందించి అభివృద్ధి చేయాలని కోరారు సమీక్షల అనంతరం ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సుమారు కోటి 80 లక్షలు నిధులను గ్రామాలకు కేటాయించి అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపగా ఎంపీడీవో శ్రీనివాసరావు గ్రామపంచాయతీ సర్పంచుల ద్వారా పంచాయతీ తీర్మానాలు ఇవ్వకుండా చేస్తూ ఫోన్‌ చేస్తున్నా సమాధానం చెప్పకుండా వ్యవహరిస్తున్న ఎంపీడీవో శ్రీనివాసరావు తో మండల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తుండగా ఎంపీడీవో శ్రీనివాసరావు సమావేశం నుండి బయటికి వెళ్లిపోయారు ఎంపీడీవో తీరుతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక వచ్చిన నిధులను వినియోగించుకోలేక సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సర్వసభ్య సమావేశం సాక్షిగా ఆవేదన వెలిబుచ్చారు. గత ఆరు నెలల కాలం నుండి ఇక్కడ ఇన్చార్జి ఎంపీడీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఒకసారి కూడా గ్రామాల అభివృద్ధి గురించి ఎంపీపీ నైన తనతో చర్చించడం కానీ కనీసం ఫోన్‌ లోనైనా మాట్లాడటం కానీ చేయకుండా తాను ఫోన్‌ చేసి మాట్లాడదామన్నా సమాధానం ఇవ్వకుండా వ్యవహరిస్తూ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని సభ్యుల ముందు ఆవేదన వెలిబుచ్చారు. ఎంపీడీవో సహకారం లేక అభివృద్ధి చేయలేకపోతున్నానని కనీసం బడ్జెట్‌ తీర్మానం కూడా చేయకుండా కాలయాపన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను పనిచేస్తుంటే అందుకు భిన్నంగా ఎంపీడీవో సరైన సహకారం అందించకపోవడం సరికాదన్నారు గ్రామాల్లో ఒకరిద్దరూ మండల పరిషత్‌ నిధులతో అభివృద్ధి పనులు చేపడితే వారికి బిల్లులు వచ్చేలా చూడాల్సింది పోయి తనకు అనుకూలమైన వారికి ఆ పనులకు బిల్లులు చేయించుకుంటూ రూపాయి కారితనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు మేరకు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే ఎంపీడీవో ప్రధాన సమస్యగా మారి అడ్డంకిగా మారి మహిళ ఎంపీపీ నైన తనపై వివక్షత చూపిస్తూ చులకన చేసి మాట్లాడుతున్నాడని సభ్యులందరూ ఎంపీడీవో తీరును అర్థం చేసుకోవాలని అన్నారు.ఎంపీడీవో వ్యవస్థకే మాయని మచ్చ శ్రీనివాసరావు అన్నారు మండల పరిషత్‌ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని సూచించారు. తాను అందరి సహకారంతో అభివృద్ధి చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. పార్టీలు కులాలకు అతీతంగా గ్రామాలు మండల అభివృద్ధి చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు తాను ఎంపీడీవో వ్యవహారం మాట్లాడుతుంటే సభ వేదికపై నుంచి దొంగలా పారిపోవడం చూస్తే ఆయన తీరు సభ్యులందరికీ అర్థమయిపోతుందన్నారు. ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి తమను మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి రానివ్వకుండా అడ్డుకోవడంతోపాటు ఎంపీటీసీ సభ్యుల ఇళ్లకు పోలీసులను పంపించి బెదిరించడం చూస్తుంటే తమపై కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుందన్నారు తాను సభ్యుల మనోభావాలను వారి సమస్యలను అర్థం చేసుకొని పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సమావేశంలో జడ్పిటిసి సభ్యులు యాదల రత్న భారతి, మండల ప్రత్యేక అధికారి అంజన ఎంపీడీవో వై శ్రీనివాసరావు ఈవో ఆర్‌ డి ఏ వి వి కుమారి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img