Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రకాశంజిల్లా : కనిగిరి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు (ఆయాలకు) ఉద్యోగ భద్రత కల్పించి వారికి పెండిరగ్లో ఉన్న వేతనాలను సత్వరమే మంజూరు చేయాలని జిల్లా ఏ ఐ టి యు సి కార్యదర్శి సయ్యద్‌ యాసీన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం కనిగిరి దర్శి చెంచయ్య గ్రామంలో కనిగిరి, హెచ్‌ఎం పాడు మండలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాసిన్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఆయలపై రాజకీయ వేధింపులు లేకుండా యూనియన్‌ ద్వారా పోరాడి పెండిరగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఆయాలకు సకాలంలో గౌరవ వేతనాలు మంజూరు చేయకుండా కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ సందర్భంగా కనిగిరి మండల సిపిఐ మండల కార్యదర్శి జి. పి రామారావు, ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల బాలిరెడ్డి మాట్లాడుతూ 2015 నుంచి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు తగవని, ఆయాలకు సత్వరమే వేతనాలు పెంచి వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఆయాలు పాఠశాలలో వెట్టిచాకిరి చేస్తుంటే వారికి సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు సునీత, పాపులమ్మ, సమాధానం ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img