Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం వహించొద్దు:డిపిఓ నారాయణ రెడ్డి

జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష సర్వే నిర్వహించండి
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

విశాలాంధ్ర`నాగులుప్పలపాడు : పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించారాదని డిపిఓ నారాయణరెడ్డి హెచ్చరించారు. మండలంలోని మట్టిగుంట గ్రామంలో బుధవారం పర్యటించారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష సర్వే లో భాగంగా ఓ ఆర్‌ ఐ మ్యాప్‌ అందించి, సర్వే విధానం గురించి పంచాయతీ కార్యదర్శి, విలేజ్‌ సర్వేయర్‌ లకు అవగాహన కల్పించారు. ప్రతి ఆస్తి సర్వే ని ఖచ్చితత్వం తో నిర్వహించాలని, అభ్యంతరాలను స్వీకరించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు, అవసరమైన పారిశుధ్య సిబ్బందిని, యంత్రాలను ప్రక్కన గ్రామల నుండి మోహరించారు. గ్రామం మొత్తము కాలి నడకన పర్యటించి, పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. చిన్న పంచాయతీ కావడంతో నిధుల లభ్యత లేక పారిశుధ్య నిర్వహణ లోపించిందని, జిల్లా లోని అన్నీ మండలాలలో ఇటువంటి చిన్న గ్రామాలలో పరిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విస్తరణాధికారులను, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు, అవసరమైతే మండలంలోని ఇతర పంచాయతీల నుండి పారిశుధ్య కార్మికులను మోహరించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించారాదని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పాలేరు అనీల కుమారి, పంచాయతీ కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img