Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బకాయిలు చెల్లించకపోతే కార్యాలయంను ముట్టడిస్తాం – దివి శివరాం

కందుకూరు: కాంట్రాక్టర్లుకు బకాయిలు చెల్లించకపోతే కార్యాలయంను ముట్టడిస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధికారులను హెచ్చరించారు. శనివారం స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మున్సిపల్‌ కమీషనర్‌ యస్‌.మనోహర్‌ను కలిసి గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు బిల్లు చెల్లించకుండా నిలిపివేయటం ఏమిటిని ప్రశ్నించారు. నూతనంగా చేసిన పనులకు బిల్లు మంజూరు చేస్తూ ఫెండిరగ్‌ బకాయిలు ఎందుకు అపారని నిలదీశారు. ఎస్సీ సబ్‌ ఫ్లాన్‌ సంబంధించిన నిధులు రాకపోతే జనరల్‌ ఫండ్‌ నిధులను 2019`20లో చేసిన కాంట్రాక్టర్లుకు చెల్లించకుండా 2020-21 పనులు చేసిన కాంట్రాక్టర్లుకు చెల్లించటం దుర్మార్గమన్నారు. కార్యాలయం సిబ్బంది కాంట్రాక్టర్లు పట్ల దురుసుగా ప్రవర్తించటం శోఛనీయమన్నారు. ఎంబుక్స్‌ను దాచిపేట్టే సంస్కృతి ఎక్కడిదన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంటే, కందుకూరులో మహీధర్‌ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అని ఎద్దేవ చేశారు. టీడీపీ యువ నాయకులు ఇంటూరి రాజేష్‌ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు చేస్తే వాటికి సంబందించిన బిల్లు చెల్లించకపోవటం వలన ఆత్మహత్యలు చేసుకుంటే ఏవరూ బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. డిపాజిట్‌ నగదు సైతం చెల్లించకుండా ఆధికారులు వ్యవహరిస్తున్న తీరు బాధకరమన్నారు. త్వరితగతిన బకాయిలు చెల్లించకపోతే ఇతర పార్టీలను కలుపుకుని ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోచిపాతల మోషే , చిలకపాటి మధు , దామా మల్లేశ్వరరావు, బెజవాడ ప్రసాదు, శ్రీహరి, షేక్‌ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img