Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మీ ఊరిలో ఇంటింటికి వైద్యసేవలు

విశాలాంధ్ర`ముండ్లమూరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం మీ ఊరిలోనే మీకు వైద్యసేవలు ఇంటింటికి వచ్చి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని మారెళ్ళ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సిహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని మారెళ్ళ ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాయుడుపాలెం గ్రామంలో గల రైతు భరోసా కేంద్రంలో శనివారం ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా 104 ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ త్వరలో అన్ని గ్రామ సచివాలయం పరిధిలో గ్రామములో నెలకు రెండు సార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్ర లో ఇద్దరు వైద్యాధికారులు ఉంటారని, ఒకరు ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, మరొకరు నెలలో 26 రోజుల పాటు గ్రామాల్లో పర్యటన చేస్తారని తెలిపారు. ప్రతి వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈరోజు నిర్వహించిన శిబిరంలో 54 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో సాధారణ వ్యాధులు 35 మంది బీపీ షుగరు 16 మంది ఒకరికి జ్వరం ఉన్నట్లు గుర్తించి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వం నూతనంగా 14 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు. 74 రకాల మందులు ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 104 డిఈఓ ప్రసాద్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ఎస్‌కెఎంఎం సుభాని, సిహెచ్‌ఓ రత్న కుమారి, టి శిరీష, ఆశాలు మార్తమ్మ, అచ్చమ్మ, అల్లూరమ్మ, ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img