Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సచివాలయ వివాదాలు సమసేదెన్నడూ..?

నేటి పలుచోట్ల తాత్కాలికంగానే నిర్వహణ
సమస్యలు పరిష్కారం అయితేనే నిర్మాణాలు

విశాలాంధ్ర నాగులప్పలపాడు : రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను శ్రీకారం చుట్టి మూడేళ్ల నిండినా నేటికీ పలు గ్రామాల్లో భవన నిర్మాణాలకు అడ్డంకులు తొలగలేదు. గతంలో వివాదాలను అంచనా వేయకుండా సచివాలయాను కేటాయించడం, అనంతరం రాజకీయ ఒత్తిళ్లు, స్థల వివాదాలు కొనసాగుతుండగా ఆయా సచివాలయాల పరిధిలో భవన నిర్మాణాలు జరగలేదు. మండలంలోని చీర్వానుప్పలపాడు గ్రామంలో గతంలో పంచాయతీ ఆగ్రహారం గ్రామంలో ఉండేది . ఆ పంచాయతీలో అగ్రహారం, పాత చీర్వానుప్పలపాడు, కొత్త చీర్వానుప్పలపాడు, గ్రామాలుండగా నూతన సచివాలయ భవనం ఎక్కడ నిర్మించాలనే దానిపై వివాదం నెలకొంది. జనాభా ఎక్కువ మంది ఉన్న అగ్రహారంలోనే నిర్మాణం చేపట్టాలని ఆ గ్రామ ప్రజాప్రతినిధి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ నిర్మాణం నిలిచిపోయింది. సచివాలయం ఒక గ్రామంలో ఆర్బీకే మరో గ్రామంలో నిర్మించాలని ప్రతిపాధన ఉన్నప్పటికీ, సమన్వయం చేసే నాయకత్వం లేకపోవడంతో నిర్మాణం ఆగిపోయింది . ఇక కండ్లగుంట సచివాలయం పరిధిలో ఒమ్మెవరం గ్రామాన్ని చేర్చారు. జనాభాపరంగా ఒమ్మెవరం పెద్ద గ్రామం. రెండు వేల పైచిలుకు ఈ గ్రామంలో జనాభా ఉంటారు. ఈ గ్రామానికి సచివాలయం కేటాయించాల్సి ఉంది. అయితే ఒమ్మెవరం గ్రామాన్ని కండ్లగుంటలో కలిపారు. దీంతో ఆ గ్రామస్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాటి నుంచి స్టేటస్కో కొనసాగుతోంది. ఈ సచివాలయం పరిధిలో సచివాలయం, ఆర్బీకే హెల్త్‌ సబీసెంటర్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇక ఎం.ముప్పాళ్ల గ్రామంలో అధికార పార్టీలోని ఒక వర్గం ఒక స్థలంలో, మరో వర్గం వారు మరో స్థలంలో నిర్మాంచాలని పట్టుబట్టారు. వారు కూడా న్యాయస్థానం గడప తొక్కడంతో ఈ నిర్మాణం కూడా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి తెలియనట్లు సమాచారం. ఉప్పుగుండూరు గ్రామానికి రెండు సచివాలయాలు మంజూరయ్యాయి. ఇందులో రెండవ సచివాలయాన్ని పేదల అనుభవంలో ఉండి, ఇళ్లు నిర్మించుకున్న స్థలంలో నిర్మించాలని అధికార పార్టీలోని ఓ వర్గం పట్టుబట్టింది. ఆ భూమి ఎండోమెంట్‌ విభాగానికి చెందినదిగా చూపారు. ఆ శాఖ అధికారులు అనుభవంలో ఉన్న పేదలకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను వారు ట్రిబ్యూనల్లో ఛాలంజ్‌ చేశారు. దీంతో ఈ నిర్మాణం కూడా వాయిదాపడిరది. ఇలా ఈ సచివాలయాల పరిధిలో భవనాలు నిలిచాయి. ఇక కనపర్తి గ్రామస్థులు కూడా భవనాలు ఎక్కడ నిర్మించాలని వివాదం ఉండడంతో వారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అక్కడ కూడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. బి. నిడమనూరు సచివాలయం పరిధిలో ఆర్బీకే, హెల్త్‌ సెంటర్ల నిర్మాణం పెండిరగ్లో ఉంది. ఇక్కడ స్థలం సమస్య ఉండడంతో దాతలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ఆ నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. అమ్మనబ్రోలులో ఆర్బీకేల నిర్మాణానికి స్థలం సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారం అయినట్లు తెలిసింది. అయితే నిర్మాణాలు ప్రారంభం కాలేదు. న్యాయపరమైన, రాజకీయ పరమైన సమస్యల పరిష్కారం కోసం అధికారులు, నాయకులు ప్రయత్నిస్తే సమస్యలు పరిష్కారమై నిర్మాణాలు కొనసాగే అవకాశం ఉంది. ఆ దిశగా వారు కృషి చేయాల్సి ఉంది.

నిర్మాణంలో ఉన్న ఉప్పుగుండూరు-1 సచివాలయ భవనం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img