Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సుస్థిరాభివృద్దే లక్ష్యంగా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి

విశాలాంధ్ర నాగులుప్పలపాడు : మండలంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారీ మీద నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల కార్యక్రమంలో డిపిఓ నారాయణరెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపిఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకములు, కేంద్ర రాష్ట్రముల నుండి విడుదల అయిన నిధులూ, ఆ నిధులతో చేపట్టబోవు పనుల వివరములను ప్రస్తుత అంచనాతో 2023-24 సంవత్సరమునకు ప్రణాళికలను తయారు చేసుకొనవలెనని తెలియజేశారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, స్త్రీ-శిశు సంక్షేమం, పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపరచుటకు, మంచినీటి వనరుల నిర్వహణ కొరకు,ఇతర అవస్థాపన సౌకర్యములు..ఇత్యాది విషయములకై అంచనాతో , ‘రాబోవు నిధులు-రాబోవు అవసరములను’ గ్రామసభలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో చర్చించి జి పి డి పి 2023-24ని ఆమోదింపజేసుకొనవలి అప్పుడే కేంద్ర స్థాయిలో గ్రామాల ప్రణాళికలు నమోదు అవుతాయని తెలిపారు . ఇప్పుడు తయారు చేసిన ప్రణాళికా ప్రకారమే గ్రామపంచాయతీ నిధులను ఖర్చు చేయవలసి ఉంటుంది కావున గ్రామస్థాయిలో అన్ని అవసరాలను గుర్తెరిగి జి పి డి పి ప్రణాళిక నందు నమోదు చేసుకొనవసి ఉంటుందని.. అందువలన శిక్షణా తరగతులు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొనవలెనని డిపిఓ నారాయణరెడ్డి తెలిపారు కోరారు.
తుఫాను హెచ్చరికలు – ముందస్తు చర్యలు చేపట్టాలి.
జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశముల మేరకు ముంచుకొస్తున్న తుఫాను దానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డివిజనల్‌ పంచాయతీ అధికారులకు, మండల అధికారులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు, లోతట్టు, తుఫాను ప్రభావిత ప్రాంతాలు గుర్తించుట, సురక్షిత ప్రాంతాలను సిద్దం చేసుకోనుట మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో పారిశుధ్య సామాగ్రి నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ పరిపాలనాధికారి, విస్తరణాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img