Friday, April 19, 2024
Friday, April 19, 2024

నాగులుప్పలపాడు మండలంలో14 సెం.మీ వర్షపాతం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు: గత 2 రోజుల నుండి మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు నీట మునగడంతో పాటు చాలా ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్ళల్లోకి చేరింది. మట్టిగుంట గ్రామంలోని శివాలయంలోకి వర్షపు నీరు 2 అడుగుల మేర చేరి గర్భగుడి లోకి చేరింది. కొత్తకోట వాగు సుమారు 5 అడుగుల మేర ప్రవహిస్తుండటంతో తిమ్మనపాలెం – నాగులుప్పలపాడు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చదలవాడ , నాగులుప్పలపాడు ఎస్టీ కాలనీలలో నీరు ఇళ్ళల్లోకి చేరడంతో కుటుంబాలను అధికారులు – సమీప పాఠశాలల్లోకి చేర్చారు, రబీ సీజనల్ వేసిన మిరప, మినుము పంటలు పూర్తిగా నీట మునిగాయి. శనివారం ఒక్క రోజే మండలంలో సుమారు 14 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు ఏ ఎస్ ఓ సుబ్బారావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img