Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

7వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం

విశాలాంధ్ర-నాగులుప్పలపాడు :- మండలంలోని నాగులుప్పలపాడు లో 7వ తేదీ ఒంగోలు రమేష్ సంఘమిత్ర హాస్పటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరము నిర్వహించనున్నారు. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాగులప్పలపాడు లో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ హాస్పిటల్ లోనే వివిధ వైద్య విభాగాలకు సంబంధించి వైద్య నిపుణులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో గుండె, ఊపిరితిత్తులు, షుగర్, బిపి ,మరియు స్త్రీలకు, సంబంధించి సమస్యలపై పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వైద్య బృందం నాగులుప్పలపాడు లోనే సాయిబాబా గుడి ప్రాంగణాన్ని వైద్య బృందం పర్యవేక్షించారు. వైద్య శిబిరానికి ఆంజనేయులు, శ్రీనివాసులు, మధు, వారి వంతు సహకరించినట్లు తెలిపారు. వివరాల కొరకు 8886092369 నెంబర్ కు సంప్రదించగలరని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img