విశాలాంధ్ర – ప్రకాశం : ప్రకాశంజిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్ళేందుకు పెళ్లి బృందం ఆర్.టి.సి. బస్సును అద్దెకు తీసుకుంది. పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా దర్శి సమీపంలో కాల్వలోకి పెళ్ళి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో షేక్ హీనా (6), షేక్ షబీనా (35), ముల్లా జానీబేగం (65), ముల్లా నూర్జహాన్ (58), షేక్ రమీజా (48), అబ్దుల్ హాని (60), అబ్దుల్ అజీజ్ (65)గా గుర్తించాంరు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

