Friday, August 19, 2022
Friday, August 19, 2022

సైబర్ నేరాల కట్టడికి పోలీస్ అధికారులకు ప్రత్యేక వర్క్ షాప్

. పోలీసులు మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా అప్డేట్ అవుతూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలి
. సైబర్ నేరాలు పట్ల అవగాహన కలిగి ఉండండి
. ప్రజలు అత్యాశతో సైబర్ నేరాల వలలో పడవద్ధు
. జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర – ఒంగోలు : రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎలా గుర్తించి ఛేదించాలి, సైబర్ నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై ఈ రోజు జిల్లా ఎస్పీ వల్లూరులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా పోలీస్ అధికారులకు మరియు టెక్నాలజీ అసిస్టెంట్ లకు సైబర్ నేరాల గురించి ప్రత్యేకమైన వర్క్ షాప్ ను నిర్వహించినారు. ఈ వర్క్ షాప్ లో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబరు ఇంటిలిజెన్సు అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ (CRCIDF) సంస్థకు చెందిన సైబర్ నిపుణుడు శ్రీ పాటిబండ్ల ప్రసాద్ గారు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నేడు సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల గురించి, వాటిని ప్రాథమిక స్థాయిలో ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని త్వరితగతిన ఛేదించుటకు దర్యాప్తులో మెళకువలు గురించి, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా వారికి ఎలా అవగాహన కలిగించాలనే పలు విషయాలు తెలియజేశారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ల వేదికగా జరిగే మోసాలు, ఓటిపి, ఎస్ఎంఎస్, వివిధ ఆన్లైన్ లింకుల వలన జరిగే నేరాలు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మోసాలు, క్యూఆర్ కోడ్ స్కానింగ్, KYC అప్డేట్ మోసాలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్, జాబ్ ఫ్రాడ్స్, అన్ వెరిఫైడ్ మొబైల్ యాప్స్, ఆన్లైన్ లోన్ యాప్స్ , OLX మోసాల గురించి, పోర్నో సైట్ ఫ్రాడ్ మరియు ఇతర మోసాలు ఎలా జరుగుతాయో అధికారులకు మరియు సిబ్బందికి వివరించి, ఆ నేరాలు జరిగినప్పుడు విచారణ ఏ విధంగా కొనసాగించాలి, టెక్నాలజీ ని ఏ విధంగా ఉపయోగించుకోని సైబర్ నేరాలను చేధించాలో కూలంకషంగా తెలియచేసినారు. అనంతరం పోలీస్ అధికారులు సైబర్ నేరాలపై పలు సందేహాలను నివృతి చేశారు. ఈ వర్కుషాప్ లో ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి వారి ధనాన్ని కాజేస్తున్నారని, కావున పోలీసు అధికారులు వివిధ రకాల సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కల్గి ఉండి సైబర్ నేరాల పట్ల సత్వరం స్పందించి, ఛేదించి, బాధితులకు న్యాయం చేసేలా నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. పోలీసులు మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా అప్డేట్ అవ్వాలని, సైబర్ మోసాలకు పాల్పడే నేరగాళ్ళకు తగిన సాక్ష్యాధారాలతో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. ప్రజలకు సైబర్ మోసాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ వర్కుషాప్ ను సద్వినియోగం చేసుకొని సైబర్ నేరాలను అరికట్టడంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. డబ్బులను ఎవరూ ఊరకనే ఇవ్వరన్న విషయాన్ని గుర్తించుకోవాలని, అత్యాశలకు వెళ్ళి మోసపోకూడదని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు, నియమాలు పాటించాలని, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు పిర్యాధు చెయ్యాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలను కోరారు. ఈ వర్క్ షాప్ లో ASP (అడ్మిన్)కె. నాగేశ్వరరావు, ASP (క్రైమ్) యస్.వి. శ్రీధర్ రావు, SEB ASP యన్.సూర్యచంద్ర రావు, DSB DSP బి.మరియాదాసు, ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, దర్శి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్, డీటీసి డిఎస్పీ రామకృష్ణ, సిఐలు, ఎస్సైలు, ఐటి కోర్ సిబ్బంది మరియు టెక్నాలజీ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img