Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బిగ్ బాస్ సీజన్ 6 లోకి వెళ్ళనున్న వరికుంటపాడు వాసి ఆదిరెడ్డి

తన యూట్యూబ్ ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడిన ఆదిరెడ్డి

విశాలాంధ్ర – పామూరు : ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పరిధిలో గత ఆరు సంవత్సరాల నుండి బిగ్ బాస్ లోకి ఇంతవరకు ఎవరు అడుగు పెట్టలేదని మొట్టమొదటి వ్యక్తిగా ఆదిరెడ్డిఓ సీజన్ 6 లోకి అడుగుపెడుతున్నాడని అందుకు ఆయనను కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఆదిరెడ్డికి అభినందనలు తెలిపారు బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి ఆరు సంవత్సరాలు అయితే ఇప్పటివరకు మన నెల్లూరు జిల్లా నుంచి ఎవరు కూడా బిగ్ బాస్ షోలోకి వెళ్లలేదు ఇప్పుడు జిల్లా నుంచి మొట్టమొదటి వ్యక్తిగా ఆదిరెడ్డి కావడం విశేషం ఆయన వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లి గ్రామానికి చెందిన బొడ్డు వెంకట ఆదినారాయణ రెడ్డి అలియా ఆదిరెడ్డి త్వరలో నిర్వహించినటువంటి బిగ్ బాస్ సీజన్ 6లోకి ప్రవేశిస్తున్నారని ఆది రెడ్డి అభిమానులు చెప్పకనే చెప్పుకుంటున్నారు ఆయన బిగ్ బాస్ రివ్యూలలో రారాజుగా పేరు పొంది ఎందరో అభిమానుల గుండెల్లో ఒక హీరోగా పేరు పొందారు ఆయన చేసిన రివ్యూలలో యూట్యూబ్లో సంచలన వ్యూస్ రావడం విశేషం అతను కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టే ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు అంతేకాకుండా ఆయన సోదరి నాగలక్ష్మి అంధురాలిగా ఉంటూ తన ఐదు నెలల పెన్షన్ సోనుసూదు కు విరాళంగా అందజేసింది సోను సూద్ ఆమె ఒక రియల్ హీరోగా వర్ణిస్తూ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ఆ పోస్టు ప్రపంచవ్యాప్తంగా ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి అంతటితో ఆగకుండా సోను సూద్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆక్సిజన్ ప్లాంటును సొంత నిధులతో ఏర్పాటు చేయించి ఆ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నాగలక్ష్మి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పక్క నుండి ఆమె చేత ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించడం ప్రజల్లో ఆమె పేరు మారుమోగింది అంతటితో ఆగకుండా యూట్యూబ్లో సోను సూద్ కు సంబంధించి వీడియోలు తీసి ఆ వీడియోల ద్వారా వచ్చిన 50,000 అమౌంట్ ను సీఎం సహాయ నిధికి 25000 సోను సూద్ ఫౌండేషన్ కి 25000 అందజేసి మరోసారి రియల్ హీరోగా పేరుపొందింది ఈ ప్రోత్సాహమంతా అన్న ఆదిరెడ్డి ప్రోత్సాహంతోనే ఇవన్నీ చేసుకుంటూ నాగలక్ష్మి ముందుకు సాగుతుంది ఆది రెడ్డి ఎంతోమంది ప్రమాదంలో ఉన్నవారికి యూట్యూబ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని తాను అందించడమే కాకుండా తన అభిమానుల చేత కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ప్రాణాలను కాపాడిన గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆదిరెడ్డి సేవలో ఎన్నో ఉన్నాయని మండలము జిల్లా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు వరికుంటపాడు మండల వాసి బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నాడు అంటే మండలానికి జిల్లాకి ఎంతో మంచి పేరని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనానో బిగ్ బాస్ సీజన్ 6 లో ఆదిరెడ్డి గెలుపొంది మండలానికి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img