Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

వైయస్ రాజశేఖర్ రెడ్డి కి భారతరత్న పురస్కారం ప్రకటించాలి

ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి యాదాల అశోక్ బాబు

విశాలాంధ్ర – నాగులప్పలపాడు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి యాదాల అశోక్ డిమాండ్ చేశారు. మండలంలోని నాగులప్పలపాడు గ్రామంలో వర్ధంతి కార్యక్రమం శనివారం ఎంపీపీ క్యాంప్ కార్యాలయంలో ఎంపీపీ అంజమ్మ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్ కూడలిలో ఉన్న వైఎస్ విగ్రహానికి ర్యాలీగా బయలుదేరి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి అశోక్ బాబు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి భారతరత్న పురస్కారం ప్రకటించాలని అన్నారు భారతరత్న గౌరవానికి అన్ని విధాలుగా అర్హుడైన నాయకుడని ఆయనకు పురస్కారం అందించాలని అన్నారు పేదల సంక్షేమానికి సంబంధించి దేశంలో ఎక్కడ ఎవరు నిరోచన కూడా చెయ్యని పథకాలను ప్రారంభించి సంక్షేమంలో ఒక కొత్త ఒరవడి వైయస్సార్ సృష్టించాలని ఆయన అన్నారు ప్రజలంతా ఆయన సంక్షేమానికి మారుపేరుగా చూస్తారని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో స్థాపించిన విధంగా 108 సర్వీస్ లను రాష్ట్రంలో ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాల ఇళ్ల వద్ద నుండే రోగులను కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు . ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లక్షల రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెట్టలేని స్థితిలో ఈ పథకం నిరుపేద ప్రజలకు దేవుడిచ్చిన వరువల ఉపయోగపడుతుంది అని అన్నారు . ఆయన ఆశయాలని తూచ తప్పకుండ నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడు పరిపాలించడం అభినందనీయం అన్నారు. ఎంపీపీ అంజమ్మ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేద యువతకు ఫ్రీ రియంబర్స్ పథకం ప్రారంభించి ఉన్నత చదువులు పూర్తి చేసే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు కాబట్టి నేడు యువత హైదరాబాద్ పూణే చెన్నై పనిచేసే అవకాశాలు వచ్చాయని అన్నారు రాష్ట్ర లిడ్ క్యాప్ డైరెక్టర్ కంచర్ల సుధాకర్ మాట్లాడుతూ.. వైయస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ళముందే సాక్షాత్కరించినట్లు ఉంటుంది నమస్తే అక్క నమస్తే చెల్లెమ్మా నమస్తే తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చివరలో ఎప్పటికీ ప్రతిదీనిస్తూనే ఉంటుంది పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకొని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మన నిత్యం ప్రజల కోసమే పనిచేశాడు ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్దికాలంలోనే మరిచిపోలేని సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు సంక్షేమ పథకాలను అమలు చేశారు సాగునీటి ప్రాజెక్టులు రహదారులు పేదలకు పక్కా ఇల్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేశారు అని అన్నారు. 2024 లో జరగబోవు ఎన్నికలలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించాలని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. అనంతరం కార్యాలయంలో మెడికల్ నిర్వహించారు రక్తదాన శిబిరము నిర్వహించారు. కార్యక్రమంలో నలమలపు కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కన్నా రాధా, లిడ్ క్యాప్ డైరెక్టర్ కంచర్ల సుధాకర్, శాలివాహన డైరెక్టర్ చెన్నకేశవులు, ఎంపీటీసీలు అనురాధ, పోదా పవన్, పోలినేని కోటేశ్వరరావు, జెట్టి శ్రీనివాసరావు, మారెడ్డి సుబ్బారెడ్డి, కాట్రగడ్డ శ్రీను, మద్దిసాని నాగేశ్వరరావు, ఆదియ్య, గోపిరెడ్డి, ఇమ్మిశెట్టి బాలకృష్ణ, గండు హరిబాబు తోకల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img