Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

కారు ఆటో ఢీకొని ఇరువురికి గాయాలు

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు: ఎదురుగా వస్తున్న ఆటో తో పాటు రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనదారుడుని కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయాలు పాలైన సంఘటన చదలవాడలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు మేరకు బుధవారం ఉదయం చీరాల నుండి ఒంగోలు వెళ్తున్న కారు చదలవాడ వద్దకు రాగా చీరాల వైపు వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనదారున్ని సైతం ఢీకొనడంతో టీ అగ్రహారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుక్కపల్లి రామకృష్ణ ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు బొజ్జ శేషారావు గాయాల పాలయ్యారు.స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు రిమ్స్ పోలీస్ ఔట్ పోస్ట్ నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉయ్యాల హరిబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img