కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి గారి పిలుపుమేరకు..
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : మండలంలోని ప్రతి గ్రామంలో ఉదయం 8 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతోత్సవం నిర్వహించాలని మండల మీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి, మండల జెసిఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా వారు వలేటివారిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించుచున్నామని ఈ కార్యక్రమానికి జెడ్పిటీసీ ఇంటూరి భారతి మరియు ఎంపీపీ పొనుగోటి మౌనిక, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు, మరియు ఎంపీటీసీలు, గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నామని తెలిపారు