Monday, September 26, 2022
Monday, September 26, 2022

రాష్ట్రంలో రాక్షస పాలన

విశాలాంధ్ర-యర్రగొండపాలెం : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు అన్నారు. యర్రగొండపాలెం సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన యువ సంఘటన ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి నిరోద్యోగ యువతను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం పై సమర శంఖం పూరిస్తూ యర్రగొండపాలెం లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు తారస్థాయిలో చేరాయని విమర్శల వర్షం కురిపించారు. ప్రధానమంత్రి మోడీ, సోము వీర్రాజు నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలపడుతుందని ఆయన చెప్పారు . బిజెపి యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మిట్ట వంశీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో యువతకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తుంగలో తొక్కి చేశారనే విమర్శలు. యువతకు ఆదర్శంగా భారతీయ మోర్చా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. బిజెపి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారతీయ యువ మోర్చా ఆగష్టు 2 నుండి 21 వరకు చేపట్టిన యువ సంఘర్షణ యాత్రను బిజెపి యువమోర్చా జాతీయాద్యక్షులు సూర్యస్వి తేజ, బిజెపి రాష్ట్రాధ్యక్షులు సోము వీర్రాజు తిరుపతిలో ప్రారంభించారు. 6వ రోజున యువ సంఘర్షణ యాత్ర యర్రగొండపాలెం కి చేరుకోవడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది. యర్రగొండపాలెం బిజెపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి బైక్ లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి యర్రగొండపాలెం సమన్వయకర్త మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎనుముల నాగేశ్వరరావు. జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం సత్యనారాయణ,
ఎస్సీ మోర్చా ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బాలకోటయ్య, యర్రగొండపాలెం బిజెపి మండల అధ్యక్షులు మాదాల సూర్యనారాయణ, బిజెపి సీనియర్ నాయకులు ఆతుకూరి రామయ్య, ఐదు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img