Friday, October 7, 2022
Friday, October 7, 2022

మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే సుధాకర్ బాబు

  • ఏఎంసీ మాజీ చైర్మన్ తో పాటు పలువురు నాయకులు దూరం
  • ఎంపీపీ, జడ్పిటిసి, గైర్హాజర్
  • వీడియో తీస్తున్న విలేకరి ఫోన్ లాగేసిన ఎమ్మెల్యే గన్ మెన్

విశాలాంధ్ర-నాగులుప్పలపాడు : వైఎస్ఆర్సిపి అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. మండలంలోని రాపర్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు టిజెఆర్ సుధాకర్ బాబు ఆ గ్రామ మహిళలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఎమ్మెల్యే ప్రతి గడపగడపకు వెళ్లి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి భరోసా కలిగింపిస్తున్నయి అన్నారు గ్రామంలో ని రోడ్లు డ్రైనేజీ అసంపూర్తిగా ఉన్నాయంటూ ఎమ్మెల్యే వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాకా అనసూయమ్మ రమణారెడ్డి , ఇనిగంటి రమణారెడ్డి, ఊదరగుడి విజయ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్ లు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
సీనియర్ నాయకులు దూరం
రాపర్ల గ్రామంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి స్థానిక సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ తుమ్మల బ్రహ్మానంద రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి అయన ను ఆహ్వానించకపోవడంతో గ్రామంలోని పలువురు నాయకులు హాజరుకాలేదు. అలాగే వైసిపి సీనియర్ నాయకులు అన్నేం వెంకటరామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కెట్టేటి అంజమ్మ లను ఈ కార్యక్రమానికి కావాలనే దూరం పెట్టారంటూ గ్రామ నాయకులు గంగి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ నలమలపు అంజమ్మ, జడ్పిటిసి సభ్యురాలు యాదాల రత్నభారతి, కూడా కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
విలేకరి ఫోన్ లాగేసిన ఎమ్మెల్యే గన్ మెన్
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామంలోని సమస్యలను మహిళలు స్థానిక ఎమ్మెల్యే వివరిస్తుండగా అక్కడే ఉన్న విశాలాంధ్ర విలేకర్ వీడియో చేస్తుండగా పక్కనే ఉన్న ఎమ్మెల్యే గన్ మెన్ కె. సురేష్ వీడియో తీస్తున్న విలేకరి ఫోన్ ను లాకుని అడ్డుకున్నాడు. ప్రజ సమస్యలకు వెలుగు చూపుతున్న విలేకరులను అడ్డుకోవడం సరికాదని పలువురు విలేకరులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img