ఆటో వర్కర్స్ యూనియన్ పిలుపు
విశాలాంధ్ర- కందుకూరు రూరల్ : ఆటో కార్మికుల సమస్యలు శాసన సభ్యులు ,జిల్లా ఎస్పీ,సబ్ కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్, డి.ఎస్.పి లు కూడా పట్టించుకోక పోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన దీక్షలకు దిగవలసి వచ్చిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య అన్నారు.ఆటో వర్కర్స్ యూనియన్ ముఖ్యుల సమావేశం శుక్రవారం ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బెంగళూరు సుధాకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాలకొండయ్య మాట్లాడుతూ ప్రతిరోజు ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికులు తమకు ఆటో స్టాండ్లు కావాలని రెండు సంవత్సరాల నుండి అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడం సోచనీయమన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పట్టణంలో తమ ఆటోలను నిలుపుదలకు ఆటో స్టాండ్లు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ కుటుంబాలను నెట్టుకొని వస్తున్న ఆటో కార్మికులు తమ సమస్య పరిష్కరించాలని ఉన్నత అధికారులకు సైతం అర్జీల రూపంలో విన్నవించుకున్న అధికారులకు చీమకుట్టినట్టు లేదని ఆయన అన్నారు.