Friday, December 1, 2023
Friday, December 1, 2023

సర్వర్ సమస్యలు అధికమించేందుకు ప్రభుత్వం సిద్ధమా

ఆన్లైన్లో హాజరుకు మేము సిద్ధం: ఉపాధ్యాయులు

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరుకు సంబంధించి సర్వర్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమా అని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల యాప్ లో హాజరు నమోదు సర్వర్ సమస్య అధికంగా ఉండటంపై ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు విడిగా నాలుగు రకాల యాప్ లు వినియోగించవలసి ఉందని అన్నారు. ప్రస్తుతం తాజా యాప్ తో ఉపాధ్యాయులు పాఠాలు బోధించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఉపాధ్యాయులను సర్వర్ సమస్యలు లేని ఎలక్ట్రిసిటీ డివైస్ లు ఉపాధ్యాయులకు అందించాలని ప్రభుత్వం ని కోరారు . అప్పటివరకు యాప్ లు హాజరు నమోదు చేయవద్దని సెల్ ఫోన్ లో నమోదు చేసుకున్న వారు ఎవరైనా ఉంటే యాప్ లనీ తొలగించాలని ఏపీటీఎఫ్ నాయకులు అన్నారు. గురువారం మాచవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఫేషియల్ అటెండెన్స్ ను వ్యతిరేకిస్తూ ప్రధానోపాధ్యాయులు కు ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శిలు డి శ్రీనివాసులు బోడపాటి అశోక్ లు వినతి పత్రం అందచేయటం జరిగింది. హెచ్ నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కు సరైన బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయకుండా తమ మొబైల్లో ఫేషియల్ ఉపాధ్యాయుల హాజరును వ్యతిరేకత తెలుపుతూ ప్రధానోపాధ్యాయునికి ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయడానికి సెల్ ఫోన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. యాప్ లు కోసం సరైన డివైస్ ఇవ్వాలని నాగులప్పలపాడు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబుకు ఫ్యాప్టో నాయకులు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీపీఎఫ్ నాయకులు ఆంజనేయులు, తిరుపతి స్వామి, శ్రీను, రాజశేఖర్, కాలేషా, శివ పార్వతి, ముత్యాలరావు, ఫ్యాప్టో నాయకులు వెంకట్రావు, మౌలాలి, ఈశ్వరయ్య, బొజ్జ ఆంజనేయులు, అల్లా భక్షు, ఆంజనేయులు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img