Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మద్యపాన నిషేధంపై మాట తప్పిన జగన్ రెడ్డి సర్కార్

విశాలాంధ్ర – ఒంగోలు : మద్యపాన నిషేధం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలను వైసీపీ ప్రభుత్వం మోసం చేయడానికి నిరసిస్తూ ఒంగోలు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన మధ్య నిషేధం చేయకపోగా విష రసాయనాలు ఉన్న నాసిరకం మద్యం రాష్ట్రంలో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటుమాటుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వ కార్యదర్శి నాలం నరసమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సంపద సృష్టించడం చేతగాక మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకొని మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఇప్పటికే 58 వేల కోట్లు అప్పులు తెచ్చారని ఆ అప్పులు తీర్చలేక రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెంచి మందుబాబుల రక్తంతో వాళ్ల కుటుంబ సభ్యుల కన్నీళ్లతో అప్పులు తీర్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీ కత్తుగా పెట్టారంటే మరి ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ సంగతి ఏమిటి జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ మహిళా జనరల్ సెక్రెటరీ బీరం అరుణ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా లాక్ డౌన్ 45 రోజులకు మించిన అవకాశం మరొకటి లేదని గుడులు బడులు తెరవక ముందే మద్యం షాపులను తెరిచి కరోనా వ్యాప్తికి కారణమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్ల చేత కూడా కరోనా సమయంలో మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిదే అని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అయ్యుండి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీను కూడా మేము ఇవ్వలేదు అని మద్యపాన నిషేధం పై వక్ర భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉంది రాష్ట్రాన్ని మధ్య ఆంధ్ర ప్రదేశ్ గా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు నేరాలు పెరిగిపోయాయని మద్యపాన నిషేధం పై మహిళలను మోసం చేసిన జగన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మహిళల చే గుణపాఠం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సెక్రటరీ కామరాజు గడ్డ కుసుమకుమారి, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img