Monday, December 5, 2022
Monday, December 5, 2022

జగన్ రెడ్డి ప్రభుత్వం ముమ్మాటికి దళిత ద్రోహి ప్రభుత్వం…

టీ డి పి ఎస్ సి సెల్ అధ్యక్షులు చుండి శ్యామ్

విశాలాంధ్ర – ఒంగోలు : జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలు సాధన కోసం ఒంగోలు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ( ప్రగతి భవన్)వద్ద ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దళిత సంక్షేమ పథకాలు అన్నిటిని మరల కొనసాగించాలని ఎస్సీల సంక్షేమం కోసం కేటాయించిన దారి మళ్లించిన నిధులను తక్షణమే దళిత సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి తక్షణమే అంబేద్కర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు తక్షణమే ప్లీజ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట పాత బైపాస్ రోడ్డుపై బైఠాయించి పెద్దపెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నావూరి కుమార్,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పసుమర్తి హగ్గయ్య రాజ్, రాష్ట్ర తెలుగు మహిళ కార్యనిర్వ కార్యదర్శి నాలం నరసమ్మ,తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ముత్తన శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ డాక్టర్ గుర్రాల రాజ్ విమల్, ఎద్దు శశికాంత్ భూషణ్, దేవతోటి సుందర్రావు, గొల్లపూడి బాబురావు, కనుమూరు సుబ్బారావు, డొక్కా శ్రీను, కసుకుర్తి అంకరాజు, భీమవరపు దయానందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img