Monday, September 26, 2022
Monday, September 26, 2022

జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది

సచివాలయ సిబ్బంది పనితీరు పై విమర్శలు
సేవలందక అవస్థలు పడుతున్న ప్రజలు
చోద్యం చూస్తున్న అధికారులు

విశాలాంధ్ర – కొండపి : ప్రజలకు సేవాలాందించవల్సిన సచివాలయ సిబ్బంది విదుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు విమరస్తున్నారు. ప్రజలకు అత్యంత సులభకరంగా పనులు జరుగతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయ సేవలు ప్రతి గ్రామ పంచాయతీ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.కానీ సచివాలయ సిబ్బంది ప్రజల సమస్యలపై చొరవచుపకపోగా సచివాలయాలకి సమయానికి రాకుండా అలసత్వం వహిస్తూ, ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.విధులకు సక్రమంగ హాజరుకాకుండా, సమయపాలన పాలన పాటించకుండా ప్రజలకు సేవలందించడంలో సచివాలయ సిబ్బంది విఫలమైయ్యారని ప్రజలు బహిరంగంగా అనుకుంటున్నారు. సోమవారం మండలంలోని చిన్నకండ్లగుంట గ్రామ సచివాలయాన్ని విశాలాంధ్ర సందర్శించగా ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాత్రమే ఉండగా మిగిలిన కుర్చీలు కాలిగా దర్శనమిచ్చాయి.గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగయినా సేవలందించే ఉద్దేశంతో
ప్రతి సచివాలయానించాయతీ కార్యదర్శి, వీఆర్వో, వెల్ఫేర్, డిజిటల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, అగ్రికల్చర్, వెటర్నరీ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ ఆరోగ్య కార్యకర్త, మహిళా పోలీసులను ప్రభుత్వం నియమించింది. వారు గ్రామంలో ఆయా శాఖలకు సంబందించి సమస్యలు ఏవైన ఉంటే సత్వరమే పరిష్కరించి ప్రజలకు మెరుగయినా సేవలు అందించాల్సి ఉండగా మండలంలోని కొన్ని సచివాలయ పరిధిలో కొందరు సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకుండా, ప్రజలకు సత్వర సేవలు చేయడంలో ఆలస్యం వహిస్తూన్నారని గ్రామ పరిధిలో ప్రజల అనుకుంటున్నారు.గ్రామ ప్రజలకు సత్వర సేవలు అందించే ఉద్దేశంతో గ్రామ సచివాలయలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ఆశయాలకు సచివాలయ సిబ్బంది తూట్లు పొడుస్తున్నారు. సచివాలయాల తనిఖీలో ఉన్నంతధికారుల నిర్లక్ష్యమే సిబ్బంది సమయానికి రాకపోవడానికి కారణమని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇంజనీరింగ్ అసిస్టెంట్ వివరణ :

సచివాలయంలో ఎవ్వరులేరని విశాలాంధ్ర ప్రతినిధి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను వివరణ కోరగా సిబ్బంది లో ఒకరు సెలవులో ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు ట్రైనింగ్ క్లాస్ లకు వెళ్లారు, కొందరు పని రీత్యా వెళ్లినట్లు సమాధానం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img