Friday, April 19, 2024
Friday, April 19, 2024

గడపగడపకు ఎమ్మెల్యేకు చుక్కెదురు

ఎమ్మెల్యే కి స్వాగతం పలుకుతున్న జనసేన జెండాలు
గ్రామంలో ప్రజల నుండి ఎమ్మెల్యే కి చుక్కెదురు

విశాలాంధ్ర నాగులుప్పలపాడు :- గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండో విడత రెండో రోజైన కొత్తకోట గ్రామంలో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు బుధవారం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో గ్రామ ప్రజల నుండి ఎమ్మెల్యేకు చుక్కెదిరయ్యింది. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు చేపట్టిన కార్యక్రమం లో రాత్రికి రాత్రి గ్రామంలో జనసేన పార్టీలోకి చెందిన ఫ్లెక్సీలు జెండాలు రాత్రికి రాత్రే ఊరంతా వెలిశాయి.అధికార పార్టీ ఫ్లెక్సీలు ఉండవలసిన చోట జనసేన ఫ్లెక్సీలు ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది ఫ్లెక్సీలు ఊరంతా ఏర్పాటు చేయడంతో కొంత రాజకీయ కలకలం మొదలైంది వైసీపీకి చెందిన కొందరు నేతలు గ్రామస్థాయి జనసేన నేతలతో సంప్రదింపులు జరిపి తమ కార్యక్రమం పూర్తయ్య వరకు ఫ్లెక్సీలు జండాలను తీసేయాల్సిందిగా కోరగా అందుకు పార్టీల నాయకులు ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలు నడుమ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గడపగడపకు కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఫ్లెక్సీ ల వ్యవహారమై ఉదయం 9 గంటలకు రావాల్సిన స్థానిక శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు 12 గంటలకు రావడం జరిగింది. కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికి మేము జనసేన పార్టీ మా ఇంటికి రావద్దు అంటూ ఎమ్మెల్యే నిలదీశారు. మరో నాలుగు ఇల్లు దాటిన తర్వాత గ్రామానికి చెందిన కొందరు గ్రామ సర్పంచ్ సురేష్ ను కార్యక్రమానికి ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయులు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు నిలదీశారు. వెంటనే గ్రామ సర్పంచ్ సురేష్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తొలి నుండి పార్టీ జెండాలు మోసిన వాళ్లను ప్రతి గ్రామంలో పక్కనబెట్టి తమ స్వార్థం కోసం పనిచేయుచుకునే వారిని అందలం ఎక్కిస్తూ ప్రభుత్వం పరువు పార్టీ పరువును మంటగలిపిస్తున్నాడని నిలదీశారు. ఎస్సీ కాలనీలోనే ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఎమ్మెల్యేతో పాటు కొందరు నాయకులు కాళ్లకు ఉన్న బూట్లు చెప్పులు విప్పకుండానే మెట్లు ఎక్కి పైకి వెళ్లిన తర్వాత అంబేద్కర్ పాదాల వద్ద చెప్పులు విప్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వెయ్యడం గమనార్హం. మొత్తానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రశాంతంగా ముగించుకోవడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img