Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్న మోది…
రాష్ట్రాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి…

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – ఒంగోలు : దేశ సంపదను ప్రధానమంత్రి కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అప్పులు పాలు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు శనివారం ఒంగోలు వచ్చినాయన స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మూడు రాజధానులు అంశం బయటకు తీసుకువచ్చి సీఎం జగన్ మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అమరావతికి అప్పుడు ఓకే అని ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని తెలిపారు.
అమరావతి కోసం పాదయాత్ర చేసే హక్కు ప్రజలకు లేదా.పాదయాత్ర చేస్తున్న రైతులను చూసి జగన్ ఎందుకు భయపడుతున్నారు అని అన్నారు.60 శాతం మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు సీఎం జగన్ ను కలవలేదన్నారు.
మూడేళ్ల కాలంలో ఒక్క ప్రతిపక్ష పార్టీనీ కూడా దగ్గరకు రానేయలేదని తెలిపారు.
జగన్ తప్పు మీద తప్పులు చేస్తున్నారు.రాజధాని గురించి మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.
సీఎం జగన్ అసెంబ్లీలోనే అబద్ధాలు, అవాస్తవాలు చెబుతున్నారు.కాంట్రాక్టర్లు పనుల కోసం టెండర్లకు పిలిస్తే బిల్లులు రావని పరుగులు తీస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పటానికి సీఎం జగన్ కు సిగ్గుండాలని అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని క్లాసులు పీకుతున్నారు.రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రానికి దూరంగా ఉన్న రాజకీయ పార్టీలపై కేంద్రం ఈడీ సోదాలు చేయిస్తుందని ఆప్ పార్టీని బద్నాం చేయడానికి లిక్కర్ స్కాం బయటకు తీసుకువచ్చారు.
పులివెందులలో చిన్న పిల్లాడిని అడిగినా వైఎస్ వివేకాను ఎవరు చంపారో చెబుతారని తెలిపారు.
దేశంలో మోదీ అత్యంత అసమర్డుడైన ప్రధానిగా మిగిలి పోతారన్నారు.కేంద్రం అన్నీ రంగాల్లో పూర్తిగా విఫలమైందని తెలిపారు.గ్యాస్ సిలెండర్ ధర 430 రూపాయలు చేస్తే ఇప్పుడున్న కేంద్ర మంత్రులు రోడ్డెక్కారు.?ఇంత ధరలు పెరిగితే వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హంగర్ ఇండెక్స్ లో పాకిస్తాన్ కంటే వెనుకబడి పోయాం.
ఇవాళ నరేంద్ర మోడీ జన్మదినాన్ని అంబానీలు, అధానీలు మాత్రమే చేసుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ml నారాయణ, pvr చేదరి పాలొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img