Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించండి

విశాలాంధ్ర బల్లికురవ : మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనునట్లు ఎంపీడీవో కృష్ణ తెలియజేశారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు సీజనల్ వ్యాధులు,వైరల్ జ్వరాలు,డెంగీ,టైఫాయిడ్ లాంటి ప్రమాదకర జ్వరాలు ప్రజల దరిచేరకుండా ఉండాలంటే గ్రామాలలో మురుగునీటి ఆవాసాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అదేవిధంగా దోమల నివారణకు ఫాకింగ్ లాంటి చర్యలు తీసుకొని,త్రాగునీటి బోర్లు,బావులు,మురుగు కలవల వద్ద బ్లీచింగ్ క్రమం తప్పకుండా చల్లించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.బుధవారం మండలంలోని కొనిదెన,ఉప్పుమాగులూరు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల పై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు.ఈ సందర్భంగా కొణిదెన సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బందికి పారిశుధ్యం పై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.గ్రామాలలో ప్రజలకు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.సచివాలయ రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సీతామహాలక్ష్మి,కొనిదెన గ్రామ సర్పంచి తన్నీరు.లేపాక్షి విష్ణు ఉపమాగులూరు గ్రామ సర్పంచి పీ.మహాలక్ష్మమ్మ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img