Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం

విశాలాంధ్ర నాగులుప్పలపాడు :- ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం 100 రోజుల పోరుబాట కార్యక్రమం లో భాగంగా పోరుబాట ప్రారంభించారు. నాలుగవ విడత జులై 28 నుండి ఆగస్టు 10 వరకు ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి పోస్ట్ కార్డుల ద్వారా సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సోమవారం నాగులుప్పలపాడు ఎంఆర్సి ముంగిట పోస్ట్ కార్డుల ప్రదర్శన ద్వారా ఉపాధ్యాయులు నిరసన తెలియజేసి ఉత్తరాలను పోస్ట్ బాక్స్ లో వేసారు. అనంతరం ఏపీ టి ఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కొరకు వంద రోజుల పోరుబాట కార్యక్రమం లో భాగంగా 5వ విడత ఆగస్టు 11న జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ముట్టిడి కార్యక్రమానికి మండలంలోని ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, మౌలాలి, తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సింగమ్మ, మోహన్ కృష్ణ, తులేరావ్, హంబాబుల్ రెడ్డి, గోరంట్ల శ్రీను, రవీంద్ర బాబు, పెద్దన్న, డి శ్రీనివాసరావు, జి.వి.ఆర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img